ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆర్ఎంఓ 

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్: హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని పరకాల ఆర్ఎంఓ డాక్టర్ బాలకృష్ణ నేతృత్వంలో  కాయకల్ప పీర్ అసెస్‌మెంట్ టీం శుక్రవారం సందర్శించింది. కాయకల్ప టీం కు హుస్నాబాద్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.  ఆసుపత్రిలోని ప‌లు రికార్డులను, రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ ఉన్న పరిసరాలను కాయకల్ప పీర్ అసెస్‌మెంట్ టీం పరిశీలించింది. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ మౌనిక, సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్, హెడ్ నర్సు ప్రసన్న, స్టాఫ్ నర్స్ సుధ తదితరులు పాల్గొన్నారు.
Spread the love