ఆర్ఎంపీ పీఎంపీ నూతన కమిటీ ఎన్నిక..

– మీడియా కోఆర్డినేటర్ మడిపల్లి వెంకటేశ్వరరావు
– ఆర్ఎంపీ లూ అప్డేట్ అవుతూ ఉండాలి – జిల్లా అద్యక్షులు సత్యవరపు జగదీష్
నవతెలంగాణ – అశ్వారావుపేట : పెరుగుతున్న జబ్బులు,కొత్తగా ఉద్భవిస్తున్న నూతన వైరస్ లు,శాస్త్రవేత్తలు కనుగొంటున్న ఔషధాల పట్ల ఆర్ఎంపీ లు ఎప్పటికప్పుడు అవగాహన చేసుకుంటు అప్డేట్ కావాలని తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ,పీఎంపీ కమ్యూనిటీ పారామెడికల్ మరియు అనుభ వైద్యుల అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అద్యక్షులు సత్యవరపు జగదీష్ అన్నారు.
ఈ సంఘం మండల సర్వసభ్య సమావేశం ఆయన అద్యక్షతన గుర్రాల చెరువు సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం విస్తరణ తో పాటు సభ్యులు అందులో మీరు ఐకమత్యంతో వారి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.అనుభవానికి మించిన,పరిమితి మించి చికిత్స చేయడం వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. అనంతరం రాష్ట్ర అద్యక్షులు వెంకటరెడ్డి ఆదేశానుసారం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తెల్లమేకల క్రిష్ణ,మడిపల్లి వెంకటేశ్వరరావు,ప్రేమ సాగర్,సత్యనారాయణ,వలీ,మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఆర్ఎంపీ పీఎంపీ మండల అద్యక్ష కార్యదర్శులుగా చంద్రశేఖర్,సత్యనారాయణలు
మండల నూతన కమిటీని ఎన్నిక…
తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ పీఎంపీ కమ్యూనిటీ పారామెడికల్స్ మరియు అనుభవ వైద్యుల అసోసియేషన్ అశ్వారావుపేట మండల అద్యక్ష కార్యదర్శులు గా సత్యవరపు చంద్రశేఖర్,వేల్పుల సత్యనారాయణ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆ సంఘం మండల సర్వసభ్య సమావేశం ఆదివారం మండలంలోని గుర్రాల చెరువు సమీపంలోని వ్యవయసాయ క్షేత్రంలో జిల్లా అద్యక్షులు సత్యవరపు జగదీష్ అద్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘం మండల  నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
25 మంది తో మండల కమిటీ ని ఆయన ప్రకటించారు.
సంఘం గౌరవ అధ్యక్షులుగా పి.ప్రసాద రావు,గౌరవ సలహాదారులు గా ఎంజీ శంకర్,పి.సత్యనారాయణ,కే.రామక్రిష్ణ, సంయుక్త కార్యదర్శి గా వై.ప్రేమసాగర్,కోశాధికారిగా ఎస్.కే వలీ,ఉపాధ్యక్షులుగా ఏ.మోహాన్ రావు,ఎస్కే మౌలానా,మీడియా కో ఆర్డినేటర్ గా మడిపల్లి వెంకటేశ్వరరావు,ఆర్గనైజర్ సెక్రటరీ లు గా జి.సత్యనారాయణ,ఎస్కే నజీర్ అహ్మద్,కే.రాము,జీ.గోవిందరాజులు,పి.పుల్లారావు,ఎస్కే రఫీ,ఎస్.రమేష్,ఎల్.నాగేంద్ర,ప్రచార కార్యదర్శులు గా ఐ.భగవాన్,పి.సుధాకర్,జి.రామక్రిష్ణ,జీ.ఆనీష్,జిల్లా కార్యవర్గం సభ్యులు గా కే.శ్రీను,రాజశేఖర్ లు హాజరు అయ్యారు.
ఆర్ఎంపీ పీఎంపీ మండల మీడియా కో ఆర్డినేటర్ “మడిపల్లి”….
తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ పీఎంపీ కమ్యూనిటీ పారామెడికల్స్ మరియు అనుభవ వైద్యుల అసోసియేషన్ అశ్వారావుపేట మండల కో ఆర్డినేటర్ గా సీనియర్ ఆర్ఎంపీ,విలేకరి మడిపల్లి వెంకటేశ్వరరావు ఆ సంఘం మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఆ సంఘం సమావేశం జిల్లా అద్యక్షులు సత్యవరపు జగదీష్ అద్యక్షతన ఆదివారం మండలంలోని గుర్రాల చెరువు సమీపంలో గల వ్యవసాయ క్షేత్రం లో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన మండల కమిటీ ని ప్రకటించారు.ఈ కమిటీలో మడిపల్లి కి స్థానం దక్కడంతో పలువురు మీడియా ప్రముఖులు,రాజకీయ నాయకులు,అధికారులు హర్షం వ్యక్తం చేసారు.
Spread the love