టోల్ సమీపంలో రోడ్డు ప్రమాదం..

Road accident near tollనవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణ సమీపంలోని 44వ జాతీయ రహదారి పై టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ క్లీనర్ కు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నుండి నాగపూర్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీని అదే వైపు వెళ్తున్న మరో లారీ ఢీకొనడంతో లారీలోని క్లీనర్, డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన క్లీనర్ తంగావెల్, డ్రైవర్ మణి ని అంబులెన్స్ లో పోలీసులు చికిత్స నిమిత్తం కామారెడ్డికి తరలించారు. రోడ్డు ప్రమాదం కారణంగా కొద్దిసేపు టోల్ ప్లాజా వద్ద వాహనాలు నిలిచిపోయాయి.
Spread the love