రైతులు సొంత ఖర్చులతో రోడ్డు మరమ్మత్తులు..

– పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
– ప్రజా ప్రతినిధులు పట్టించుకోని రోడ్డు పనులు నిర్వహించాలి 
– శ్రీరామగిరి గ్రామ రైతులు 
నవతెలంగాణ – నెల్లికుదురు 
మండలంలోని శ్రీరామగిరి గ్రామం లోని శ్రీరామగిరి నుండి లక్ష్మిపురం ఎక్స్ రోడ్డు వెళ్లే ఆలేరు డోనక రోడ్డు ను మరమ్మతులు చేసి రైతులను ఆదుకోవాలని ఆ గ్రామ రైతులు ప్రశాంత్, యాదగిరి, నరసింగా ,కృష్ణ ,కోరారు శుక్రవారం రైతులు వారి సొంత ఖర్చులతో సుమారు 60 ట్రాక్టర్ ట్రిపుల మురారిని పోసి జెసిబి డోజర్ సహాయంతో బొందలు లేకుండా రోడ్డు సౌకర్యం కల్పించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఎన్నోసార్లు ఎంతోమంది ఆ దొనక గుండా వెళ్లే రైతులు అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పిన ఎవరు పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడు వ్యవసాయం చేసుకునే సమయం దగ్గరికి రావడంతో అటు వెళ్లే రైతులకు ఎంతో ఇబ్బంది ఉందని ప్రస్తుతం కోసం అటు వెళ్లే రైతులు వారి సొంత డబ్బులను జమ చేసుకొని మైన రిపేరు చేసుకుంటున్నామని అన్నారు. ఎన్నోసార్లు ఎంతోమందికి చెప్పిన ప్రయోజనం లేకపోవడంతో రైతులే సమిష్టిగా కొంత సొంతడబ్బులు కూడబెట్టుకొని 60 ట్రాక్టర్ ట్రిప్పుల మోరాన్ని జెసిబి, సహాయంతో  ట్రాక్టర్లతో తోలుకొని డోజర్, యంత్రాలతో రోడ్డు మరమ్మత్తులను చేసుకుంటున్నామని అన్నారు. ఏ దారి గుండా వెళ్లే రైతులు దాదాపుగా 200 మంది రైతులు వారికి నిత్యం వ్యవసాయ పనులకు ఇట్టి రోడ్డు పైనుండే రాకపోకలు ఉండడంతో బురద గుంటల మాయమైన ఈ రోడ్డు పై నానయాతన పడుకుంటూ రైతులు నడవాల్సిన దీన  పరిస్థితి నెలకొంది అని అన్నారు. గతంలో కూడా రోడ్డుకు మరమ్మత్తులు నిర్వహించాలని అనేకమార్లు విన్నవించుకున్నప్పటికీ ప్రయోజనం జరగలేదు. ఇప్పటికైనా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి అధికారులు ప్రజాప్రతినిధులు ఇట్టి రోడ్డుపై మరమ్మత్తులు నిర్వహించాలని ప్రజలు వేడుకుంటున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామగిరి రైతులు నర్సింగ అశోక్ పోతారాజు యాదగిరి, సంద కృష్ణ, మడిపేద్ది చంద్రయ్య,కడుద్దుల లింగారెడ్డి నర్సింగ వెంకన్న, పోతారాజు శ్రీశేలం, మాదరి ప్రశాంత్, బొమ్మిడి వినోద్ రెడ్డి,డోనికాని శ్రీనివాస్, పోరండ్ల వెంకన్న రంజిత్ సాయి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love