తిరుమలాయపాలెంలో దారి దోపిడీ

నవతెలంగాణ-హైదరాబాద్ : గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో బెదిరించి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన గురువారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన కొండబాల బాబురావు అనే వ్యక్తి, బైక్ పై తను పామ్ ఆయిల్ తోటకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో ఇద్దరు అగంతకులు మాస్కులు ధరించి కత్తులు, కర్రలతో బెదిరించి అతని మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు చైను, ఆరు గ్రాముల బంగారు ఉంగరం ఎత్తుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై గిరిధర్ రెడ్డి చోరీ జరిగిన ప్రదేశాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

Spread the love