రోడ్లన్ని బ్లాక్ …ప్రయాణికుల షాక్..!

– వినాయక మండపాలతో ప్రయాణికులకు ఇక్కట్లు..?
నవతెలంగాణ – చందుర్తి
వినాయక చవితి వచ్చిందంటే చాలు ఎటు చూసినా రోడ్లన్ని మూసివేస్తున్నారు. నియోజకవర్గంలో వేములవాడ పట్టణం తో పటు వివిధ మండలంలో పోటా పోటీగా మండపాల ను నిర్మాణం చేపట్టారు. రోడ్ విస్తీర్ణం ఎంతుంటే ఏం లాభం భారీ విగ్రహాల ను నెలకొల్పి రోడ్లను బ్లాక్ చేస్తున్నారు. ఉదాహరణకు వేములవాడ పట్టణంలో అసలే ఇరుకు రోడ్లునిత్యం భక్తుల రద్దీ ఉంటుంది.మరో వైపుగా వినాయక చవితికి భారీ మండపాల నిర్మాణం చేపట్టడం తో  పాద చారులకు, ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు ఎదుర్కోవడం జరుగుతుంది. ఇదే తంతు నియోజకవర్గం లో జరుగుతుంది. దేవుడంటే అందరికి భక్తి కానీ రోడ్ల ను బ్లాక్ చేయడమేమిట ని ప్రయాణికులు వాపోతున్నారు.

Spread the love