
ఎలుగుబంటి దాడిలో గాయపడిన వ్యక్తికి అటవీశాఖ అధికారులు 4 లక్షల రూపాయల చెక్కు రూపంలో నష్టపరిహారం అందించారు. పదర మండలం మద్దిమడుగు రేంజ్ పరిధిలో మూడు నెలల క్రితం నల్గొండ జిల్లా కాశరాజపల్లికి చెందిన అంజయ్య ఎలుగుబంటి దానికి గురయ్యారు. జిల్లాట శాఖ అధికారి రోహిత్ గోపిడి ఆదేశాల మేరకు అటవీ శాఖ అధికారులు గురువారం బాధితుని ఇంటికి వెళ్లి నాలుగు లక్షల రూపాయలు నష్టపరిహారం అందజేశారు.