
కరీంనగర్ ఎస్పీగా, అడిషనల్ డీజీపీగా, గురుకులాల కార్యదర్శిగా పని చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయోపిక్ సినిమాను పట్టణంలోని హరిహర థియేటర్లో నేడు విడుదల కానున్నట్లు బీఎస్పీ రాష్ట్ర మహిళా కన్వీనర్ ఆకినపల్లి శిరీష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకులాల కార్యదర్శిగా పనిచేసే సమయంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను ఎలా ఉన్నత శిఖరాలు చేరే విధంగా తయారుచేశా రో, ఈ సినిమాలో చూపించడం జరిగిందని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిమానులు ఈ సినిమాను తిలకించాలని ఆమె కోరారు.