ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయోపిక్ ని ఆదరించాలి

నవతెలంగాణ – మహాముత్తారం 
ఫిబ్రవరి 16న, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ వారి బయోపిక్ నీ ఆదరించాలని బీఎస్పీ మహా ముత్తారం మండల అధ్యక్షులు రామగిరి రాజుఅన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్  బయోగ్రఫీ ఈనెల 16న విడుదల కానుంది. మన రాష్ట్రంలో పేద ప్రజల పిల్లలకు అసలు చదువు ఎందుకు అందకూడదు. ఒకవేళ ఆ విద్యను అందిస్తే ఆ పిల్లలు ఏ రేంజ్ లోకి ఎదుగుతారు అనేది కళ్లకు కట్టినట్టు చూపించిన వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే మన రాష్ట్రంలో ముఖ్యంగా బహుజనులకు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ ఆలోచన లేకపోవడం వలన ఈ వర్గాల పిల్లలు చదువులో ఎదగలేక పోతున్నారు కనుక బహుజనులకు రాజ్యాధికారం అనేది వస్తే కచ్చితంగా ప్రతి కుటుంబంలో నుంచి పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐపీఎస్, ఐఏఎస్ మరియు ఇంకెన్నో ఉన్నతమైన చదువులను పొంది వాళ్ళ కుటుంబాలను బాగు చేసుకునే అవకాశం ఉంది అని చెప్పడానికే ఈ “ప్రవీణ్ కుమార్ ఐపిఎస్  బయోపిక్” విడుదల చేయనున్నారని తెలిపారు.  ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు.
Spread the love