కార్మికుల శ్రమ దోపిడి చేస్తున్న పాలకులు..

Rulers who exploit the labor of workers..– 2వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి..
నవతెలంగాణ – డిచ్ పల్లి
కార్మికుల శ్రమను దోపిడి చేస్తున్న పాలకులు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు  ఇవ్వటం లేదని, కేవలం 9500 ఇచ్చి ఏళ్ల తరబడి వారిని శ్రమ దోపిడీ చేస్తున్నదని పీఎఫ్ కానీ, ఈ ఎస్ ఐ లేదని, మేము అధికారం లోకి వస్తే వెంటనే పర్మినెంట్ చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని నాటి ప్రతిపక్ష నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొందని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యాయులు వెంకన్న పేర్కొన్నారు. రాష్ట్ర మహాసభ పోష్టర్ లను గురువారం డిచ్ పల్లి లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్రిల్ ల్ 5 న నారాయణ పేట్ జిల్లా కేంద్రంలో జరిగే తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (టియుటిఐ అనుబంధం) రాష్ట్ర 2వ మహాసభలలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రా వ్యాప్తంగా దాదాపు 60 వేల మంది గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారని, వారు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామం లోని అన్నిరకాల పనులు చేస్తున్నారు. అటువంటి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు  ఇవ్వటం లేదన్నారు.కేవలం 9500 ఇచ్చి సంవత్సరాల తరబడి వారిని శ్రమ దోపిడీ చేస్తున్నదని పీఫ్ కానీ, ఈ ఎస్ ఐ కానీ లేదని అన్నారు. మేము అధికారం లోకి వస్తే వెంటనే పర్మినెంట్ చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని నాటి ప్రతిపక్ష నేటి అధికార కాంగ్రెస్ పార్టీ కార్మికుల సమ్మే సoదర్బంగా ఇచ్చిన హామీ  పదిహేను నెలలు గడుస్తన్నా కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు . కనీసం ప్రతినెలా క్రమం తప్పకుండా వేతనాలు కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రతి రెండు నెలలకు ఒక సారి వేతనాలకోసం కార్మికులు ఆందోళనలు చేయవలసిన దుస్థితి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మికుల సమష్యలు పరిస్కారం కావాలంటే ప్రతినిత్యం పోరాటం చేయాలనీ  అన్నారు. ఈ మహాసభ  కు కార్మికులు అధిక  సంఖ్యలో  పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జీపీ కార్మికులు సుశీల, నరేష్, శ్రీకాంత్, నవిన్, సాయిలు, సాయి కూమార్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love