Friday, July 3, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకీవ్‌‌పై రష్యా క్షిపణులతో దాడులు

కీవ్‌‌పై రష్యా క్షిపణులతో దాడులు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: రష్యా – ఉక్రెయిన్‌ ‌యుద్ధం గత ఐదేళ్లుగా కొనసాగుతూనే ఉంది. తాజాగా గురువారం తెల్లవారుజామున ఉక్రెయిన్‌ ‌రాజధాని కీవ్‌‌పై రష్యా వందలాది డ్రోన్లు, డజన్ల కొద్దీ క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడుల్లో 27 మంది మృతి చెందారు. 91 మందికి గాయాలయ్యాయి. 130 భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ సంవత్సరంలో ఇదే అతి క్రూరమైన దాడి. ఒకేసారి పదుల సంఖ్యలో పౌరులు తమ ప్రాణాలు కోల్పోయారు.

కాగా, రష్యా చేసిన ఈ దాడుల వల్ల తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి కీవ్‌‌లోని వేలాది మంది నివాసితులు బాంబ్‌ ‌షెల్టర్లు, భూగర్భ మెట్రో స్టేషన్లవైపు పరుగులు తీశారు. బాంబులకు ఆకాశమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఈ దాడుల వల్ల 26 మంది మృతి చెందగా.. ఒకరు గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 27కి చేరింది. 91 మంది గాయాలపాలయ్యారు అని రాజధాని సైనిక యంత్రాంగం అధిపతి టైమూర్ ట్కాచెంకో టెలిగ్రామ్‌లో తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. శుక్రవారం రాత్రి వరకు కూడా ఈ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని అని ట్కాచెంకో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -