ఆటో డ్రైవర్ కుటుంబానికి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి చేయూత..

– రూ. 3 వేల రూపాయలు ఆర్థిక సహాయం
నవతెలంగాణ – తాడ్వాయి 
కాటాపూర్ గ్రామానికి చెందిన గాంధెర్ల శంకర్ అనే ఆటో డ్రైవర్ పేద కుటుంబం కావడంతో వారి కుమారుడు స్నేహిత్ కు అనారోగ్యం వల్ల వరంగల్ యంజియం లో వైద్యం పొందుతున్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబం, కొడుకు ఆనారోగ్యంతో ఉండి వైద్యం పొందుతుండగా, విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై ననిగంటి గంటి శ్రీకాంత్ రెడ్డి ఒక కానిస్టేబుల్ ఇచ్చి హాస్పిటల్ కు పంపించి మెరుగైన వైద్యం అందించేలా వైద్యులతో మాట్లాడి, ఖర్చుల సహాయార్థం రూ. 3000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఆటో డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకున్న స్థానిక ఎస్సై నని గంటి శ్రీకాంత్ రెడ్డి కి ఆటో యూనియన్ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా వచ్చిన తక్కువ సమయంలోనే అందరి మనల్ని పొంది ప్రతి ఒక్కరికి సహాయం అందించే ఎస్సై శ్రీకాంత్ రెడ్డి కి మండల ప్రజలు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
Spread the love