Sunday, May 31, 2026
E-PAPER
Homeఆటలుసబలెంక జోరు

సబలెంక జోరు

- Advertisement -

ప్రీ క్వార్టర్స్‌‌లో టాప్‌ సీడ్‌
ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌‌స్లామ్‌

పారిస్‌ (‌ఫ్రాన్స్‌) : ఫ్రెంచ్‌ ఓపెన్‌‌లో ఓవైపు పురుషుల సింగిల్స్‌‌లో సంచలనాల మోత మోగుతుండగా.. మహిళల సింగిల్స్‌‌లో టైటిల్‌ ‌ఫేవరేట్స్‌ ‌సాధికారిక విజయాలతో దూసుకెళ్తున్నారు. టాప్‌ ‌సీడ్‌ అరినా సబలెంకా (బెలారస్‌) ‌మూడో రౌండ్లోనూ అలోవక విజయం సాధించి ప్రీ క్వార్టర్‌‌ఫైనల్లోకి ప్రవేశించింది. 6-0, 7-5తో ఆస్ట్రేలియా అమ్మాయి డరియా కసట్కినాపై సబలెంక వరుస సెట్లలో గెలుపొందింది. ఐదు బ్రేక్‌ ‌పాయింట్లతో రెచ్చిపోయిన సబలెంకా.. ఆసీస్‌ అమ్మాయిని చిత్తు చేసింది. తొలి సెట్లో కనీస పోటీ ఇవ్వలేని డరియా రెండో సెట్లో సబలెంకా సర్వ్‌‌ను బ్రేక్‌ ‌చేసి ప్రతిఘటించింది. 5-5తో స్కోరు సమం కాగా.. సబలెంకా వరుస గేములు గెల్చుకుని మూడో రౌండ్లో అలవోక విజయం సాధించింది. 16వ సీడ్‌, జపాన్‌ ‌స్టార్‌ ‌నవొమి ఒసాక సైతం ప్రీ క్వార్టర్స్‌‌లో కాలుమోపింది. అమెరికా ప్లేయర్‌ ఇవా జోవిక్‌‌పై మూడు సెట్ల మ్యాచ్‌‌లో ఒసాక గెలుపొందింది. 7-6(7-5), 6-7(3-7), 6-4తో ఒసాక పైచేయి సాధించింది. తొలి రెండు సెట్లు టైబ్రేకర్‌‌కు దారితీయగా.. ఒసాకా, ఇవాలు చెరో సెట్‌‌లో పైచేయి సాధించారు. నిర్ణయాత్మక మూడో సెట్‌‌లో ఇవా జొవిచ్‌ ‌సర్వ్‌ ‌బ్రేక్‌ ‌చేసిన ఒసాక ప్రీ క్వార్టర్స్‌ ‌బెర్త్‌ ‌దక్కించుకుంది. ఒసాక 12 ఏస్‌‌లు, 3 బ్రేక్‌ ‌పాయింట్లతో మెరువగా.. ఇవా 4 ఏస్‌‌లు, 2 బ్రేక్‌ ‌పాయింట్లతో సరిపెట్టుకుంది. పాయింట్ల పరంగా 114-110తో ఒసాక పైచేయి నిలుపుకుంది. 11వ సీడ్‌, స్విస్‌ అమ్మాయి బెలింద బెన్సిక్‌ ‌మూడో రౌండ్లో అమెరికా ప్లేయర్‌‌పై 6-3, 6-3తో వరుస సెట్లలో సులువుగా గెలుపొందింది. 4 బ్రేక్‌ ‌పాయింట్లతో మెరిసిన బెలింద ఆడుతూ పాడుతూ ప్రీ క్వార్టర్స్‌‌కు చేరుకుంది. ఆరో సీడ్‌ ఆమంద అనిషిమోవ 3-6, 6-4, 6-7(3-10)తో ఫ్రాన్స్‌ అమ్మాయి డయానా చేతిలో మూడు సెట్ల మ్యాచ్‌‌లో ఓటమిపాలైంది. డయానా 10 ఏస్‌‌లు, నాలుగు బ్రేక్‌ ‌పాయింట్లతో ఆమందను మట్టికరిపించింది. పురుషుల సింగిల్స్‌‌లో రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ ‌జ్వెరెవ్‌ ‌(జర్మనీ) 6-4, 6-3, 5-7, 6-2 క్వింటన్‌ (‌ఫ్రాన్స్‌)‌పై గెలుపొంది ప్రీ క్వార్టర్‌‌ఫైనల్లోకి ప్రవేశించాడు. మూడో సీడ్‌ ‌జకోవిచ్‌ (‌సెర్బియా) మూడో రౌండ్లో బ్రెజిల్‌ ఆటగాడి చేతిలో ఐదు సెట్ల మ్యాచ్‌‌లో పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. జానిక్‌ ‌సినర్‌, డానిల్‌ ‌మెద్వదేవ్‌, నొవాక్‌ ‌జకోవిచ్‌ ‌నిష్క్రమణతో పురుషుల సింగిల్స్‌ ‌టైటిల్‌ ‌వేట ఆసక్తికరంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -