ముగిసిన సీసీపీఎల్ క్లబ్ లీగ్
నవతెలంగాణ-హైదరాబాద్ : పది వారాలుగా, 19 వేదికల్లో ఉత్సాహంగా సాగిన సీసీపీఎల్ క్లబ్ లీగ్ గండిపేట్‌లోని క్రాస్‌కోర్ట్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన టైటిల్ పోరుతో
ఘనంగా ముగిసింది. ఉత్కంఠగా జరిగిన ఫైనల్లో పెంగ్విన్ పీసీపై 4-0తో వైకింగ్స్ పీసీ ఘన విజయం సాధించింది. హోమ్-అండ్-అవే పద్ధతిలో సాగిన ఈ టోర్నమెంట్‌లో కాన్ఫరెన్స్-ఎ ఫైనల్ మ్యాచ్‌లో డీఆర్‌సీ స్పోర్ట్స్ ఫౌండేషన్‌పై పెంగ్విన్ పీసీ 4-2 తేడాతో విజయం సాధించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. కాన్ఫరెన్స్-బి ఫైనల్ మ్యాచ్ ప్రేక్షకులను ఉత్కంఠ తీరాలకు తీసుకెళ్లింది. వైకింగ్స్ పీసీ, బిల్డ్ క్రూ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ 3-3 తో టై అయింది. దీంతో విజేతను నిర్ణయించడానికి నిర్వహించిన ‘గేమ్ బ్రేకర్’ రౌండ్‌లో వైకింగ్స్ పీసీ 25-22 తో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. అదే జోరును కొనసాగిస్తూ ఫైనల్లో వైకింగ్స్ పీసీ 4-0 తేడాతో పెంగ్విన్ పీసీని చిత్తు చేసి సీసీపీఎల్ క్లబ్ లీగ్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ టోర్నమెంట్‌లో 350 మందికి పైగా రిజిస్టర్డ్ అథ్లెట్లు ఈ టోర్నీలో బరిలోకి దిగగా, అందులో 92 మంది మహిళలు ఉండటం విశేషం. సెంటర్ కోర్ట్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ వ్యవస్థాపకులు యశ్వంత్ బియ్యాల, విక్రాంత్ రావు టోర్నమెంట్ విజయవంతం కావటంపై హర్షం వ్యక్తం చేశారు.
చాంపియన్ వైకింగ్స్
- Advertisement -
- Advertisement -



