నవతెలంగాణ – మిరు దొడ్డి
తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం మలిదశ ఉద్యమంలో. తెలంగాణ ప్రజలను చైతన్య పరుస్తూ అనేక ప్రజా పోరాటాల్లో ఆటపాటలతో ప్రజలను చైతన్యపరిచి రాష్ట్రం సాధించడంలో కీలకంగా పనిచేసిన ఉద్యమ కళాకారులమైన మాకు స్వరాష్ట్రం ఏర్పడ్డాక గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం దాని అన్నారు. ప్రజలను చైతన్య పరిచే సత్తా ఉన్న కళాకారులమైన మేము మాకు మేమే చైతన్యం కాకపోవడం చాలా బాధాకరమైన విషయం అని తెలిపారు.ఇలాంటి పరిస్థితుల్లో కళాకారులమైన మా హక్కుల కోసం. నకిరేకంటి కిరణ్ కుమార్ నూతనంగా తెలంగాణ కళావేదిక అనే సంఘాన్ని స్థాపించడం జరిగింది అని అన్నారు. అదే క్రమంలో నాపై నమ్మకంతో దుబ్బాక నియోజకవర్గం అధ్యక్షునిగా ఎన్నుకోవడం నా కళకు దక్కిన గౌరవంగా భావిస్తూ నాకి బాధ్యతలు అప్పజెప్పినటువంటి రాష్ట్ర అధ్యక్షులు నకిరే కంటి కిరణ్ కుమార్ కు మరియు రాష్ట్ర గౌరవ సలహాదారులు మద్దెల నర్సింలు, బొల్గం రాజేష్ తెలంగాణ కళావేదిక సిద్దిపేట జిల్లా అధ్యక్షులు. హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.