సేయింట్ థామస్ విద్యార్థుల ప్రతిభ అమోఘం..!

– ఇంటర్నేషనల్ ఒలింపియాడ్లో మెరిసిన విద్యార్థులు
– జోనల్ మెడల్స్ తో పాటు ర్యాంకులు
నవతెలంగాణ -పెద్దవూర : కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించ వచ్చు అనుటకు ఉదాహరనే సేయింట్ థామస్ విద్యార్థులప్రతిభ.నల్గొండజిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం వెల్మగూడెం సేయింట్ థామస్ పాఠశాల విద్యార్థులు ఈ నెల 08 న హైదరాబాద్ లో జరిగిన ఇంటర్నేషనల్ జనరల్ నాలెడ్జ్ ఒలంపియాడ్ లో పాల్గొని అసాధ్యం అనుకున్న జోనల్ మెడల్ తో పాటుగా వివిధ ర్యాంకులు సాధించారు. ఈసందర్బంగా సోమవారం మండలంలోని సేయింట్ థామస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో జరిగిన విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో గోల్డ్ మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ సాధించిన విద్యార్థులను తల్లిదండ్రుల సమక్షంలో సర్టిఫికెట్స్ మెడల్స్ ఇచ్చి  ఘన సన్మానం చేశారు. ఈసందర్బంగా పాఠశాల ప్రిన్సిపాల్ మార్టిన్ మాథ్యూ మాట్లాడుతూ ఫస్ట్ అటెంప్ట్ లోనే జోనల్ ర్యాంకుతో పాటు ఇతర ర్యాంకులు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని, విద్యార్థులని అన్ని రంగాలలో ప్రథమ స్థానంలో నిలపడానికి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కృషి ఎంతో అవసరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రియాంక, జిస్మి, శ్రీనయ్య,పద్మావతి, జాన్సిరీణు, వరలక్ష్మి, సంగీత, పద్మ, శ్రీలత రెడ్డి, ధనలక్ష్మి, శుభశ్రీ, ఆశ, రాజశ్రీ, స్వాతి, హిప్సిబా మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Spread the love