Sunday, July 26, 2026
E-PAPER
Homeజాతీయంవిద్యార్థుల పోరాటానికి సెల్యూట్‌..వారికి ప్రధాని క్షమాపణ చెప్పాలి

విద్యార్థుల పోరాటానికి సెల్యూట్‌..వారికి ప్రధాని క్షమాపణ చెప్పాలి

- Advertisement -

మోడీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం వచ్చింది
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, తమ భవిష్యత్తును యువతే కాపాడింది
ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా అనంతరం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : నీట్‌-జీ ప్రశ్నపత్రం లీక్‌ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసిన అనంతరం కాంగ్రెస్‌ అగ్రనాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత (ఎల్‌ఓపీ) రాహుల్‌ గాందీ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా విద్యార్థుల విజయమని అన్నారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. అలాగే విద్యార్థులకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలనీ, నిరసనల సందర్భంగా పోలీసు హింసపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ వీడియో సందేశం ద్వారా స్పందించారు. దేశవ్యాప్తంగా నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంపై ఆందోళనలు నిర్వహించిన విద్యార్థులను అభినందించారు. ”ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా భారత విద్యా వ్యవస్థను పునర్నిర్మించే దిశగా ఒక పెద్ద అడుగు. దేశవ్యాప్తంగా పోరాడిన ప్రతి విద్యార్థికి అభినందనలు. మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం” అని ఆయన అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడింది విద్యార్థులే
విద్యార్థుల పట్టుదల వల్లే దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, అలాగే వారి భవిష్యత్తు రక్షించబడిందని రాహుల్‌ గాంధీ తెలిపారు. నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌పై విద్యార్థులు నిర్వహించిన ఉద్యమం దేశానికి ఒక గొప్ప సందేశం ఇచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో ఒక డిమాండ్‌ నెరవేరి నప్పటికీ.. ఇంకా రెండు కీలక అంశాలు మిగిలి ఉన్నా యని రాహుల్‌ గాంధీ అన్నారు. దేశ యువత పట్ల గౌరవం చూపుతూ ప్రధాని మోడీ విద్యార్థులకు బహిరం గంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇతర వర్గాలు కూడా హక్కుల కోసం పోరాడాలి
దేశంలోని రైతులు, కార్మికులు, పేదలు, అలాగే ప్రభుత్వం అణచివేస్తోందని భావిస్తున్న ఇతర వర్గాల ప్రజలు కూడా రాజ్యాంగబద్ధ మార్గంలో తమ హక్కుల కోసం పోరాడాలని రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. ”గౌరవం కోసం, హక్కుల కోసం రాజ్యాంగబద్ధంగా నిలబడటమే నిజమైన ధైర్యం” అని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన రాహుల్‌ గాంధీ.. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని తొలగించాల్సిన సమయం వచ్చిందనీ, భయపడొద్దని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -