జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గురువారం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ హైదరాబాద్ లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు, హోలీ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేయాలని కవిత సూచించినట్లు వివరించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే విధంగా చూడాలని కవిత సాంబారి మోహన్ కు సూచించారు. జిల్లా, మండలాల్లో ఉన్న స్థితి గతులను అడిగి తెలుసుకున్నాట్లు పేర్కొన్నారు.