

నేడు సమ్మక్క రాక
నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం సమ్మక్క వనదేవత అయిన పుట్టినిల్లు బయ్యక్కపెట్ గ్రామంలో బుధవారం మండే మెలిగే పండుగ సమ్మక్క ఆడబిడ్డలుగా కొలిచే చందవంశీలు ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయమే లేచి తలంటు స్థానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరించి గుళ్ళో పూజా సామాగ్రిని శుద్ధి చేశారు. గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంకా మేడారంలో మండే మెలిగే పండుగ జరిగే విధంగానే బయ్యక్కపేటలో కూడా అలానే నిర్వహించారు. సమ్మక్క ఆలయాన్ని శుద్ధిచేసి, ఊరు పొలిమేరలో ద్వారా స్తంభాలు కట్టి గ్రామ నిర్బంధం చేశారు. గ్రామంలో ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమ్మక్క పుటిల్లు అయినా బయ్యాక్కపేటలో నేడు గురువారం దేవుని గుట్ట నుండి సమ్మక్క వనదేవతను గద్దే పైకి రానుoది. మహా జాతర అనంతరం వచ్చే మినీ జాతర భయ్యాక్కపేట లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ మినీ జాతరకు చందా వంశీయులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో చందా గోపాల్ రావు, చందా రఘుపతిరావు, కళ్యాణ్ రావు, చందపరమయ్య, గణేష్, వెంకటేశ్వర్లు, వడ్డెలు సిద్దబోయిన చలమయ్య, కృష్ణారావు ఆలం సమ్మయ్య గ్రామ పెద్దలు, మహిళలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.