సిరిసిల్ల కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝా..

– బదిలీ అయిన కలెక్టర్ అనురాగ్ జయంతి
నవతెలంగాణ – సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్ బదిలీపై వచ్చారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా పనిచేసిన అనురాగ్ జయంతి కరీంనగర్ కు బదిలీపై వెళ్ళాడు. సందీప్ కుమార్ గతంలో ఐటిఈ అండ్ సి జాయింట్ సెక్రటరీ గా, కొమురం భీం జిల్లా కలెక్టర్ గా పని చేశారు. జి హెచ్ ఎంసీ అడిషనల్ కమిషనర్ గా కూడా ఆయన పని చేశారు. ప్రస్తుతం ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ గా పనిచేస్తున్న ఆయనను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Spread the love