పట్టణంలోని జంకానగూడెం సీతా నగర్ లో గడ్డి పిచ్చి మొక్కలు పెరగడం మురుగు కాలువలు నీరు ప్రవహించకపోవడంతో మాజీ కౌన్సిలర్ బంగారు రెక్కల స్వామి పారిశుద్ధ కార్మికులను కలిసి సమస్యను వివరించి శనివారం పనులు చేయించారు. అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్ వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇట్టబోయిన సబితా గోపాల్, సానిటర్ ఇన్స్పెక్టర్ రజిత, జవాన్ నర్సింగరావు,లమున్సిపల్ సిబ్బంది వార్డు ప్రజలు పాల్గొన్నారు.