నవతెలంగాణ-హైదరాబాద్: శివసేన (యూబీటీ) ఎంపీలే లక్ష్యంగా ‘ఆపరేషన్ టైగర్‌కు ఎన్డేయే నేతలు తెరలేపారని మహారాష్ట్రలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే పలువురు ఎంపీలు పార్టీ మారనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈక్రమంలోనే ఎక్స్ వేదికగా ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఎంపీలను పార్టీ మారేందుకు ఒక్కొక్కరికి రూ.50 కోట్ల కనీస మద్దతు ధర నిర్ణయించారని, అందులో రూ.15 కోట్లు అడ్వాన్స్ ఇస్తున్నారని రౌత్ ఆరోపించారు.
దీనిపై తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా వెంటనే స్పందించారు. ‘కేవలం 15 కోట్లేనా? మా ఎంపీలకు రూ.4 కోట్లు అడ్వాన్, తర్వాత 36 నెలల వరకూ నెలకూ రూ.కోటి ఆఫర్ ఇచ్చారు. హనీ ప్లస్ మనీ’ అని పోస్టు చేశారు.



