Tuesday, August 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విఠలేశ్వర ఆలయంలో సంత్ శిరోమణి నామదేవ్ మహరాజ్ పుణ్యతిథి

విఠలేశ్వర ఆలయంలో సంత్ శిరోమణి నామదేవ్ మహరాజ్ పుణ్యతిథి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్: మద్నూర్ మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయంలో మంగళవారం మండల మేరు సంఘం ఆధ్వర్యంలో కుల గురువు సంత్ శిరోమణి నామదేవ్ మహరాజ్ 676వ సజీవ సమాధి (పుణ్యతిథి) ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయంలో కీర్తనకారులు పాంచాళ్ గోపాల్ మహరాజ్ గులాల్ భజన, కీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. హారతి అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. పండరీపురం విఠలేశ్వర భక్తులుగా సంత్ నామదేవ్ మహరాజ్ ప్రసిద్ధి పొందారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల మేరు సంఘం సభ్యులు, భజన మండలి భక్తులు, పూజారులు, మేరు కులస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -