Monday, September 21, 2026
E-PAPER
Homeఆదిలాబాద్కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళులు 

కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళులు 

- Advertisement -

నవతెలంగాణ-ఆసిఫాబాద్ 
తెలంగాణ ఉద్యమ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించడంతో పాటు తెలంగాణ ప్రజలు జాతిపితల కొలుచుకునే జిల్లాకు చెందిన పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 14 వ వర్ధంతిని జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పద్మశాలి సంఘ భవనంలో నిర్వహించిన వర్ధంతి వేడుకల్లో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఇరుకుల్ల మంగ, పట్టణ అధ్యక్షులు అనుమాండ్ల శ్రీకాంత్ లు పాల్గొని బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసిన వారు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలిచిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు.

నిబద్ధత కలిగిన రాజకీయవేత్త, తెలంగాణ ఉద్యమ నిర్మాత, క్విట్ ఇండియా పోరాటం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన ఆయన ఆసిఫాబాద్ మొదటి ఎమ్మెల్యే గా విశేషమైన సేవలు అందించాలని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తి జిల్లాకు చెందినవాడు కావడం జిల్లా వాసులుగా తమ అందరికి గర్వకారణమన్నారు. అటువంటి మహనీయుని విగ్రహం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కోమటిపల్లి లింగయ్య, కోశాధికారి గుజ్జ మోహన్, సీనియర్ నాయకులు గుండా శంకర్, పట్టణ మహిళా అధ్యక్షురాలు జంజీరాల పుష్పలత, కోశాధికారి అనుమాండ్ల క్రాంతి, ప్రచార కార్యదర్శి గుజ్జ రేవతి, సంఘ నాయకులు తేలివార్ మోహన్, వనమాల ధర్మయ్య, జంజీరాల లక్ష్మీనారాయణ, గుండా శ్యామ్, ఆవిడపు రామన్న, కోడం అజయ్, పసుపునూరి రవి, వనమాల వెంకటేష్ పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రావ్ చౌక్ వద్ద ఎమ్మార్పీఎస్ బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతిలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జాతీయ నాయకుడు రేగుంట కేశవ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ గొప్ప నేత కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 9 సంవత్సరాల వయసులో పోరాటం ప్రారంభించడమే ఆయనకున్న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తెలియజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రేగుంట మహేష్, కాంపెల్లి రాజలింగం, కాల్కర్ రాము, కవర్కార్ లక్ష్మణ్, గణపతి, నామ్ దేవ్, బాలాజీ, మల్లేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -