Monday, September 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన విద్య

ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన విద్య

- Advertisement -

నవతెలంగాణ – తొగుట 
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మెరుగైన విద్య అందుతుందని సర్పంచ్ చంద లావణ్య స్వామి అన్నారు. సోమవారం మండలంలోని చందాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యార్థుల కు ప్రభుత్వం అందజేసిన దుస్తువులు, షూస్, టీచింగ్, లెర్నింగ్ వస్తువులు ప్రధానోపాధ్యాయులు సిద్దేశ్వర్, ఇన్‌స్ట్రక్టర్ గీత తొ కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు మెరుగైన విద్య, వసతులు అందుతాయాన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయు లు రాంబాబు, నాగేష్, రాజలింగం, అరుణశ్రీ, గంగ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -