Monday, September 21, 2026
E-PAPER
Homeఖమ్మండ్రోన్ పైలట్ సర్టిఫికెట్ కోర్సుకు వ్యవసాయ విద్యార్థుల ఎంపిక

డ్రోన్ పైలట్ సర్టిఫికెట్ కోర్సుకు వ్యవసాయ విద్యార్థుల ఎంపిక

- Advertisement -

– అభిమానించిన అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత కుమార్ 
నవతెలంగాణ – అశ్వారావుపేట

వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే దిశగా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులకు అరుదైన అవకాశం లభించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజే టీఏయూ) ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌లోని సీ-డీఏటీ కేంద్రంలో నిర్వహిస్తున్న వారం రోజుల డ్రోన్ పైలట్ సర్టిఫికెట్ కోర్సుకు కళాశాలకు చెందిన బీఎస్సీ అగ్రికల్చర్ నాలుగో సంవత్సరం విద్యార్థులు పది మంది ఎంపికయ్యారు.

విద్యార్థుల విద్యా ప్రతిభ, క్రమశిక్షణ, ప్రవర్తన, బాధ్యతాయుత వైఖరి ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లు కళాశాల వర్గాలు తెలిపాయి. ఎంపికైన వారిలో భార్గవ్, వంశీ, రఘువీర్, రాహుల్, హరీష్, సిరిచందన, మేఘన, శ్రీలేఖ, నిఖిత, హుదా మీరాజ్ ఉన్నారు.

డ్రోన్ల ద్వారా పంటల పర్యవేక్షణ, పంట ఆరోగ్య పరిశీలన, పురుగుమందులు–పోషకాల సమర్థ వినియోగం తదితర ఆధునిక వ్యవసాయ పద్ధతులపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నైపుణ్యాలు భవిష్యత్తులో రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక సేవలు అందించడంలో ఉపయోగపడనున్నాయని కళాశాల వర్గాలు పేర్కొన్నాయి.

విద్యార్థుల ఎంపికపై కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్‌ జె. హేమంత్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఆధునిక వ్యవసాయ సాంకేతికతపై విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవడం భవిష్యత్ ఉపాధి అవకాశాలతో పాటు వ్యవసాయ సేవలకు దోహదపడుతుందని తెలిపారు.

కార్యక్రమాన్ని కళాశాల అధ్యాపకులు డాక్టర్‌ జెమిమా, డాక్టర్‌ పి. నీలిమ సమన్వయం చేస్తున్నారు. విద్యార్థులు శిక్షణను సద్వినియోగం చేసుకొని డ్రోన్ సాంకేతికతలో నైపుణ్యం సాధించాలని అధ్యాపకులు ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -