తిప్పారం తాండ పాఠశాలలో సరస్వతి విగ్రహావిష్కరణ

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని తిప్పారం తాండ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రాథమికపాఠశాల మరియు అంగన్వాడీ కేంద్ర ప్రాంగణంలో ఘనంగా జ్ఞాన సరస్వతి దేవి విగ్రహం ఆవిష్కరించడం జరిగింది. సరస్వతి విగ్రహని దాత మంజాబీర్మల్ అందజేశారు. సరస్వతి దేవి విగ్రహానికి హోమము పూజా కార్యక్రమం నిర్వహించి ప్రతిష్టాపన చేశారు. ఈ పూజా కార్యక్రమము సర్పంచ్ సుందరి బాయి బిషన్ లాల్  ఆధ్వర్యంలో విద్యా కమిటీ చైర్మన్ మంజ పెంటయ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సేవల, పిఎసిఎస్ వైస్  చైర్మన్ ఉద్దల్ సింగ్, గ్రామ పెద్దలు టీకారాం గంగారం యువకులు తాన్ సింగ్, ఉపాధ్యాయులు స్వప్న, రవి, ప్రకాష్ మరియు అంగన్వాడి టీచర్ శారద పలువురు పాల్గొన్నారు.
Spread the love