గాంధారి మండల కేంద్రంలో ఎన్ ఎస్ యూ ఐ ఎల్లారెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు సర్దార్ నాయక్ మాట్లాడుతూ..ఈ నెల 6 వ తేదీ నీట్ కౌన్సిలింగ్ జరిపే నిర్ణయని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, పేపర్ అమ్ము కోవడం పై కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం దారుణమని, 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షల పై నమ్మకం లేకుండా పోతుంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అమ్ముకోవడం పై సాక్ష్యాలు ఉన్న నిజమని తేలిన ఎందుకు మౌనంగా ఉంటుందని, ఎందుకు 6వ తేదీ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని మొండిగా వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్ళి నిర్వహించాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఎన్ డి ఏ సంస్థ ను వెంటనే రద్దు చేయాలి. 24లక్షల మంది నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు నాయ్యం చేయాలి. ఇప్పటికే అనేక తరహాలో మేము నిరసన వ్యక్తం చేశాము. తెలంగాణ రాష్ట్రం నుండి కూడా 70 వేలకు పైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాశారువిద్యా సంస్థలు అన్ని కేజీ టూ పిజి వరకు సహకరించాలి. నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది తరుపున అందరూ నిలవాలి.ఈ బంద్ లో ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నలని కోరుతున్నాను. కొత్త చట్టాలను తీసుకుని రావడం కాదు వాటిని సమర్ధవంతంగా అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కార్యక్రమాలు మరింత ఉదృతం చేస్తాము ఆయన పేర్కొన్నారు.