గంగారంలో ఘనంగా సార్లమ్మ పండుగ 

– ఘనంగా నిర్వహించిన పూజారులు 
నవతెలంగాణ -తాడ్వాయి 
ములుగు జిల్లా తాడ్వాయి మండలం గంగారం గ్రామంలో సారలమ్మ పండుగను గౌరబోయిన వంశీయులు బుధవారం ఘనంగా నిర్వహించారు. మండె మెలిగే పండుగ లో భాగంగా గుడిని, గుడి లోని పూజా సామాగ్రిని శుద్ధి చేశారు. డోలు వాయిద్యాలతో ఆదివాసి సాంప్రదాయాల ప్రకారం ఊరి చివరలో ద్వారా స్తంభాల ఏర్పాటు చేసి, గ్రామంలోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు గురువారం సమ్మక్క వనదేవత పండుగను కూడా ఘనంగా నిర్వహించినట్లు పూజారులు తెలిపారు. సార్లమ్మ పండుగ 15వ తారీకు వరకు జరగనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి సార్లమ్మ వనదేవతను దర్శించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారులు, గ్రామ పెద్దలు, గౌరబోయిన బిక్షపతి, తాజా మాజీ సర్పంచ్ గౌరబోయిన నాగేశ్వరరావు, ప్రధాన పూజారి ఈసం వెంకటేష్, యాలం విక్రం, నరసయ్య, దాట్ల బాబు, పూర్ణ, దేవర బాలలు ఇర్ప సులోచన, గౌరబోయిన రాధ, గంగమ్మ, గ్రామ పెద్దలు, మహిళలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love