నిరంతరం ప్రజాసేవలో ఉంటాను: సర్పంచ్

నవతెలంగాణ – ధర్మసాగర్
సర్పంచిగా పదవి కాలం పూర్తయిన, నిరంతరం ప్రజాసేవలో ఉంటానని సర్పంచ్ ఎర్రబెల్లి శరత్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో సెక్రెటరీ కార్యదర్శి మహేశ్వర్ ఆధ్వర్యంలో సర్పంచ్ వీడుకోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాసిల్దార్ సదానందం, ఎంపీడీవో జోహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సేవలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతి ప్రజా ప్రతినిధి ఐదు సంవత్సరాలు వారు అందించిన సేవలను ప్రజలు గుర్తిస్తారని అన్నారు. ఇది నిరంతర ప్రక్రియను కొనియాడారు. అనంతరం సర్పంచ్ ఎర్రబెల్లి శరత్ మాట్లాడుతూ ఇప్పటివరకు ధర్మసాగర్ గ్రామ ప్రజలు మండలంలో మరి జిల్లాలో రాష్ట్రస్థాయిలో ఊహించనంత  అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగామని అందులో గ్రామ ప్రజలు అత్యంత విశ్వాసంతో నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం జరిగిందన్నారు. ఇప్పటివరకు గ్రామాభివృద్ధికి సహకరించిన ప్రజానీకానికి, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచిగా పదవి కాలం పూర్తయిన నిరంతరం ప్రజాసేవలో ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం కార్యదర్శి సమక్షంలో వార్డు సభ్యులను అంగన్వాడి ఆశా కార్యకర్తలను, మండల మహిళా సమైక్య సభ్యులను, గ్రామపంచాయతీ వార్డు సభ్యులను, కో ఆప్షన్ సభ్యులను, గ్రామపంచాయతీ స్టీరింగ్ కమిటీ మెంబర్లను శాలువాలతో సత్కరించారు. అనంతరం సర్పంచ్ ఉప సర్పంచ్ లను ఘనంగా పుష్పగుచ్చాలతో శాలలతో సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో తహసిల్దార్ సదానందం, ఎంపీడీవో జోహార్ రెడ్డి, కారోబార్ చల్ల మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ బొడ్డు అరుణ ఇమాన్, ఎంపీటీసీలు వనమాల, బొడ్డు శోభ,  ఏపీఎం అనిత, కో ఆప్షన్మ కట్కూరి గోపాల్ రెడ్డి, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love