
వేద గణితం శిక్షణలో అశ్వారావుపేట కు చెందిన సిద్ధాంతపు సాత్విక్ సాయి కుమారా చార్యులు ప్రతిభకనబర్చాడు.వాగ్దేవీ కళాపీఠం, విశాఖపట్టణం వారు గత 6 మాసాలుగా అంతర్జాతీయంగా అంతర్జాలంలో నిర్వహించిన శిక్షణను పొందాడు. శిక్షణ అనంతరం నిర్వహించిన పరీక్షలను వ్రాయగా గురువారం వెలువరించిన ఫలితాలలో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత చెంది అత్యంత ప్రతిభను కనబర్చాడు. దీనికి సంబంధించిన ధృవ పత్రాన్ని మెయిల్ ద్వారా వాగ్దేవి కళాపీఠం వారు పంపించారు. ఈ సందర్భంగా వాగ్దేవి కళాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వెంపరాల వెంకట లక్ష్మీ శ్రీనివాసమూర్తి, వేద గణితం శిక్షకు రాలు జి.సత్య లు శుక్రవారం సాత్విక్ సాయికుమార్ కు ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు.