విధుల్లో చేరిన ఎస్ బీఐ మేనేజర్.. 

నవతెలంగాణ – నెల్లికుదురు 

మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ గా సోమవారం విధుల్లో చేరినట్లు నూతన ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ ఎల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఎస్బిఐ బ్రాంచ్ భూపాలపల్లిలో విధులు నిర్వహించి నూతనంగా బదిలీపై ఈ నెలక మండల
 బ్రాంచ్ మేనేజర్ గా వచ్చానని అన్నారు. ఇక్కడ విధులు నిర్వహించిన పర్వతం రాజేష్ శాయంపేట బ్రాంచ్ వెళ్లినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బ్యాంకు అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని తెలిపారు. ఖాతాదారులు ఈ బ్రాంచ్ అభివృద్ధి కోసం మేనేజర్ కు సహకరించాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ రవీందర్ హరి సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love