
నవతెలంగాణ-గోవిందరావుపేట
ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని లేనియెడల ఎస్సీ ఉప కులాలు తీవ్రంగా నష్టపోతాయని విహెచ్పిఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు బానోత్ బద్రు అన్నారు. సోమవారం మండల కేంద్రం.లో జాతీయ రహదారి దుంపెళ్లి గూడెం జాంక్షన్ లో ఏర్పాటు చేసిన ఎమ్మార్పీఎస్ మరియు ఎం ఎస్ పి ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రమేష్ మాదిగ అధ్యక్షతన ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని బద్రు మరియు దండోరా జాతీయ నేత దళిత రత్న అవార్డు గ్రహీత నెమలి నరసయ్య లు ప్రారంభించి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్గీకరణ అమలు చేయకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగ నియమకాలు చేపడితే మాదిగలు తీవ్రంగా నష్టపోతారని అన్నారు ఎస్సీల వర్గీకరణ కోసం *మాదిగలు పద్మ శ్రీ మంద కృష్ణమాదిగ నాయకత్వంలో చేసిన* పోరాటం ఉద్యోగాల కోసం అని అలాంటిది వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపడితే మాదిగలకు ఏం న్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఆగమేఘాల మీద అసెంబ్లీ లో బిల్లు పెట్టిన షెడ్యూల్డు కులాల వర్గీకరణ జాబితాలో తక్కువ జనాభా కలిగి ఎక్కువ ఉద్యోగాలు పొందిన కులాలు ఏ గ్రూపు కలిగి ఉండడం సి గ్రూపులో దేశంలోనే అన్ని రంగాలలో అభివృద్ధి పొందిన మాల కులంలో ఉంచిన నేతాకానీ కులాన్ని ప్రత్యేకంగా గ్రూపును కేటాయించకుండా తప్పుల తడక ఉన్నటువంటి sc వర్గీకరణ నివేదిక ను సరి చేయకుండానే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 నియామక ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అంటే మాదిగ మాదిగ ఉపకులాల ప్రజలను ఇంకా పదేళ్ల పాటు ఉన్నత ఉద్యోగ రంగంలోకి రాకుండా కాంగ్రెస్ పార్టీ కుట్రను ప్రజలు ప్రజా స్వామిక వాదులు గమనిస్తూన్నరని మాదిగ ఉపకులాల ప్రజలు చైతన్యం తో హక్కుల ఉద్యమాన్ని కొనసాగించాలని కోరారు.
ముమ్మాటికి మాదిగలకు మాదిగ ఉపకులాలకు, నేతకాని కులానికి, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర నష్టం చేస్తుందని దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగలు, పద్మ శ్రీ మంద కృష్ణమాదిగ చేస్తున్నా పోరాటాన్ని అర్థం చేసుకొని వెంటనే గ్రూప్ 1 , 2 , 3 నియామకాలలో వర్గీకరణ అమలు చేసి మాదిగ మాదిగ ఉప కులాలకు రావాల్సిన ఉద్యోగాలు వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం వర్గీకరణ లేకుండా డీఎస్సీ ఉపాధ్యాయుల నియామకాల్లో వర్గీకరణ అమల్లో లేకపోవడంతో మాదిగలకు 11 వందల ఉద్యోగాలు రావలసి ఉండగా మాదిగలకుమాదిగ ఉప కులాలకు కేవలం 300 నుంచి 400 వరకు మాత్రమే ఉద్యోగాలు వచ్చి దాదాపు 700 ఉద్యోగాలు మాదిగలు నష్టపోయారని అణగారిన జాతులను అట్టడుగుకు నెట్టి వేసే కుట్రలను *మాదిగ దండోరా* గమనిస్తుందని ఇలాంటి చర్యలు ప్రభుత్వం మానుకొని మాదిగల పక్షాన నిలబడి న్యాయం చేయాలని కోరుచున్నాo దీక్షా శిబిరంనకు విచ్చేసి మద్దతు ప్రకటించిన ఎన్ హెచ్ ఆర్ సి జాతీయ మానవ హక్కుల కమిటీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు, దీక్షలో ఉద్యమకారులు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు యనగంధుల మొగిలిమాదిగ, మండల కార్యదర్శి జoగిడి ప్రకాశ్ మాదిగ గోవిందరావుపేట గ్రామ బూత్ అధ్యక్షులు కేశపాక కార్తీక్ మాదిగ, మాదిగ డప్పు కళ మండలి మండల నాయకులు జన్ను సాంబయ్యమాదిగ, కొత్తపల్లి నరేష్ మాదిగ, గోపీదాస్ చిన్న సారయ్యమాదిగ, తెలంగాణ ఉద్యమ కారుల సీనియర్ నాయకులు ఎన్ హెచ్ ఆర్ సి మండల అధ్యక్షులు కొండి రమేష్ మహాజన్ ఎం ఎస్ మండల అధ్యక్షులు పసుల భద్రయ్య మాదిగ, ఎల్ హెచ్ పి ఎస్ మండల నాయకులు అజ్మీరా రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు