Wednesday, August 12, 2026
E-PAPER
Homeజాతీయంఆ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ఆ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మూడు రాష్ట్రాల్లోని అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. బిహార్‌లోని బాంకీపూర్, మధ్యప్రదేశ్‌లోని దటియ, గుజరాత్‌లోని మంజల్పూర్ బై పోల్ ఎన్నికలు జరగనున్నాయి. బిహార్‌లోని బంకీపూర్ సీటుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. అసెంబ్లీ ఉపఎన్నికలకు జులై 6 నుంచి జులై 13 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఆ తర్వాత జులై 14న నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. జులై 16 వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా విడుదల కానుంది. జులై 30న పోలింగ్, ఆగస్టు 3న కౌంటింగ్ ఉంటుంది.  

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -