Thursday, August 27, 2026
E-PAPER
Homeజాతీయంకిర్గిస్థాన్‌లో ఎస్‌సీవో సదస్సు..హాజరుకానున్న పీఎం

కిర్గిస్థాన్‌లో ఎస్‌సీవో సదస్సు..హాజరుకానున్న పీఎం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఆగష్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్‌లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కిర్గిస్థాన్‌లో జరిగే ఎస్‌సీవో 2026 సదస్సుకు హాజరవుతారు. సెంట్రల్ ఆసియా దేశాలైన ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్‌లతో ద్వైపాక్షిక, వ్యాపార, వాణిజ్య బంధాలను బలోపేతం చేసేందుకు ఈ పర్యటన ఉపయోగపడనుంది. ఎస్‌సీవో సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోదీ భేటీ అవుతారని భారత విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -