హైదరాబాద్ : ప్రభుత్వ రంగ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్‌కు ప్రముఖ ఎక్సట్రాపవర్ ఫ్లీట్ కార్డ్ లాయల్టీ ప్రోగ్రామ్‌కు బిజినెస్ ప్రాసెస్ ట్రాన్స్ఫర్మేషన్ విభాగంలో స్కోచ్ గోల్డ్ అవార్డు 2025 లభించింది. ఈ పురస్కారాన్ని వందో స్కోచ్ సమ్మిట్‌లో స్కో చ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ అధ్యక్షులు సమీర్ కోచర్ ఇండియన్ ఆయిల్ బృందానికి అందజేశారు. రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో వినియోగదారులకు అనుకూలమైన డిజిటల్ పరిష్కారాలు అందించడంలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ ప్రశంస దక్కిందని ఇండియన్ ఆయిల్ సంస్థ పేర్కొంది.