రెండవ రోజు ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు

రెండవ రోజు ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలునవతెలంగాణ-నస్పూర్‌
తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు నిక్షేపాలను వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేనిరాహార దీక్షలు మంగళవారం రెండవ రోజు కొనసాగాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో వెలువడిన బొగ్గునిక్షేపాలను ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి సంస్థకే కేటాయించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం చేపట్టిన రిలే నిరాహార దీక్షలో భాగంగా శ్రీరాంపూర్‌ జీఎం కార్యాలయం ఎదుట కొనసాగింది. సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య సందర్శించి వారికి సంఘీభావాన్ని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, శ్రీరాంపూర్‌ బ్రాంచ్‌ కార్యదర్శి ఎస్‌కే బాజీ సైదా, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, సీపీఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, ఏరియా కార్యదర్శి ప్రసాద్‌రెడ్డి, ఫీట్‌ కార్యదర్శులు గొల్లపల్లి రామచందర్‌, గునిగంటి నరసింహారావు, తిరుపతి, సహాయ కార్యదర్శి లక్కిరెడ్డి సత్తిరెడ్డి, జీపీ రావు పాల్గొన్నారు.

Spread the love