‘అయోద్య’ విరాళాల వివాదంపై సుప్రీంకు వినతి
న్యూఢిల్లీ : రామ మందిర విరాళాలు గల్లంతైన వివాదంపై సిసిటివి ఫుటేజ్ వంటి ఎలక్ట్రానిక్ సాక్ష్యాధాలు రాబోయే రోజుల్లో అదృశ్యం కావచ్చని, తుడిచిపెట్టుకుపోవచ్చని, కరప్ట్ అయ్యే అవకాశాలు వున్నాయని,అందువల్ల వాటిని భద్రపచాలని పిటిషనర్లలో ఒకరైన అడ్వకేట్ ఎన్.కె.గోస్వామి సుప్రీం కోర్టును సోమవారం కోరారు. ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాలనేవి రాతిపై లిఖించిన శాసనాలు కాదు, ఎల్లప్పటికీ అలాగే వుండిపోవడానికి. కోర్టు నిర్ధారణల కోసం సీసీటీవీ వ్యవస్థ వేచి వుండదు. డిజిటల్ చెల్లింపుల వివరాలు, రికార్డులను చూసే సౌలభ్యం కూడా మారిపోవచ్చు, లేదా అవి తొలగించబడొచ్చు, కాబట్టి ముందుగా ఈ కేసులో సాక్ష్యాధారాలను భద్రపరుచుకోవడం అత్యంత ముఖ్యం. అలా కాకుండా వాయిదా వేస్తే అది న్యాయాన్ని నిరాకరించడానికి దారి తీయగలదు.’’ అని గోస్వామి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ ఎదుట ఆయన ఈ ప్రస్తావన చేశారు. రామ మందిరం విరాళాల దుర్వినియోగం కేసులో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలు చేసిన తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు కోరారు. అందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ వేసవి శలవుల్లో ఇలా వచ్చిన అభ్యర్ధనలను సుప్రీం తిరస్కరించడం ఇది రెండవసారి.
తాను తుది విచారణ కోరడం లేదని, ఎవరిపట్లా పక్షపాతం చూపని విధంగా సాక్ష్యాధారాలను పరిరక్షించే ఉత్తర్వులు జారీ చేయాలని మాత్రమే కోరుతున్నానని గోస్వామి చెప్పారు. కేసు విచారణకు స్వీకరించేలోగా హుండి రిజిస్టర్లు, లెక్కింపు పత్రాలు, బ్యాంక్, వ్యాలెట్ రికార్డులు అన్నీ కూడా పోవచ్చని, అదే తన భయాందోళన అని ఆయన వ్యాఖ్యానించా రు. జులై 12తో వేసవి శెలవులు ముగుస్తాయని, ఆ తర్వాత మాత్రమే పిటిషన్ విచారణకు స్వీకరించడం జరుగుతుందని సుప్రీం కోర్టు రిజిస్ట్రీ తనకు తెలియచేసిందని గోస్వామి చెప్పారు.
సాక్ష్యాధారాలు అదృశ్యమయ్యేలోగా భద్రపర్చండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



