– కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వానాకాలానికి సంబంధించి రైతులకు కావాల్సిన విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఉంచిందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మెన్ అన్వేష్‌రెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. వానాకాలానికి నెల రోజుల ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ప్రణాళికను సిద్ధం చేసినట్టు చెప్పారు. పచ్చి రొట్టె విత్తనాలు సైతం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 55 లక్షల ఎకరాలకు సరిపడా కోటి 18 లక్షల పత్తి విత్తనాలను ఇప్పటికే ఆయా జిల్లాలకు పంపించినట్టు చెప్పారు. 10 లక్షలకు పైగా ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేశారని వివరించారు.