గుర్తింపు పొందిన దుకాణాల్లో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి

నవతెలంగాణ – పెద్దవూర
మండలంలోని రైతులు గుర్తింపు పొందిన విత్తన దుకాణాల్లో మాత్రమే కావాల్సిన విత్తనాలను కొనుగోలు చేయాలని మండల వ్యవసాయవిస్తరణ అధికారులు రైతులకు సూచించారు. మంగళవారం మండలం లోని గర్నేకుంట, చలకుర్తి, పులిచర్ల, పర్వే దుల, వెల్మగూడెం, గ్రామాల్లో రైతులకు పంటల సాగు విధానం పై అవగాహన కల్పించారు. ఏ ప్రాంతంలోనైనా కచ్చితమైన కంపెనీ పేరు, బిల్లులు లేకుండా విడిగా విత్తనాలు విక్రయిస్తే వెంటనే మండల వ్యవసాయ అధికారి తెలియజేయాలని తెలిపారు.పత్తి విత్తనాలు అధిక ధరకు విక్రయిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామన్నారు. భూసార పరీక్షల ఆధారంగా రైతులు ఎరువులు వాడాలని అన్నారు.రైతులు కూడా విత్తనాల కొనుగోలు సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించి దుకాణాదారు నుంచి రశీదు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమం లో ఏఈఓ లు ఆంజనేయులు,తనూజ,సితార,మధుకర్, రాము తదితరులు పాల్గొన్నారు.
Spread the love