అక్రమ ఇసుక రవాణ ట్రాక్టర్ల పట్టివేత..

నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని తోటపల్లి గ్రామ శివారులోని మోయతుమ్మెద వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 ట్రాక్టర్లను పట్టుకుని పోలిస్ స్టేషన్ కు తరలించామని ఎస్ఐ క్రిష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. అక్రమంగా ఇసుక రవాణ చేసే వాహనలపై చట్టపరమైన చర్యలు చేపడుతామని ఎస్ఐ హెచ్చరించారు.
ఇసుక రవాణకు అడ్డుకట్ట.. మోయతుమ్మెద వాగు నుండి అక్రమ ఇసుక రవాణను అరికట్టడానికి జేసీబీ యంత్రంతో గుంతలు తవ్వి అడ్డుకట్ట వేసినట్టు ఎస్ఐ క్రిష్ణారెడ్డి తెలిపారు. రవాణాదారులు సాహసంతో అడ్డుకట్టను ఉల్లంఘించి అక్రమ ఇసుక రవాణ చేపడితే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్ఐ క్రిష్ణారెడ్డి తెలిపారు.

Spread the love