తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ నందు నాల్గోవ తరగతిలో ప్రవేశం కొరకు జిల్లా స్థాయి లో బాలబాలికలను ఎంపిక చేసినట్లు జిల్లా యువజన క్రీడల అధికారి కే జగదీశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు గేమ్స్ పెట్టి ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎంపికకు జిల్లాలోని అన్ని గ్రామాల నుండి 57 మంది బాలురు 45 మంది బాలికలలు హాజరయ్యారు అని తెలిపారు. ఈ ఎంపిక లో బాలబాలికలకు 09 మోటార్ క్వాలిటి టెస్టులు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది బాలురు 20 మంది బాలికలను ఎంపిక చేసి జూలై 09, 10 తేదీలలో రాష్ట్ర స్థాయిలో జరిగే ఎంపికకు పంపడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ అజమ్ బాబు, వ్యాయామ ఉపాద్యాయల అధ్యక్షులు పి. మల్లేష్ జనరల్ సెక్రెటరీ ఐ. శ్రీనివాస్,అథ్లెటిక్ అసోషియేషన్ సెక్రెటరీ గడ్డం వెంకటేశ్వర్లు, వ్యాయామ ఉపాద్యాయులు పాల్గొన్నారు.