నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ప్రాజెక్టు అధికారి తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ హైదరాబాద్ ఆదేశానుసారం ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన కల్పించుటకై డిపిఆర్ఓ నల్లగొండ ద్వారా కళాజాత బృందాల ఎంపిక ను చేస్తున్నట్లు జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ సుధాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక ప్రక్రియను ఈనెల 19న డి పి ఆర్ ఓ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. కావున ఆసక్తి వున్న కళాకారులు తెలిపిన తేదీన తమ తమ బృంద సబ్యులతో పాటు హాజరై తమ ప్రదర్శన ఇవ్వాలని తెలిపారు. సభ్యులు వయో పరిమితి 45 సం. లకు మించరాదని, బృంద సభ్యులు ఐదుగురిలో ఒక మహిళా కళాకారిణి తప్పనిసరని తెలిపారు.