
మండలంలోని హాస కొత్తూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం స్వయం పరిపాలన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తూ తోటి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు.ఈ స్వయం పరిపాలన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలుగా తేజశ్రీ వ్యవహరించగా ఉపాధ్యాయులుగా అనన్య, నిత్యశ్రీ, రిషిక, వాణి, మహిత, రుతిక, రోవిన, అవంతిక, దివ్య, మాన్య, వన్షిత, ఆదిత్య, శ్రీజిత్, కే మహిత వ్యవహరించారు.అనంతరం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో స్వయం పరిపాలన దినోత్సవంలో భాగంగా పాఠశాలలో ఉపాధ్యాయులుగా వ్యవహరించడం పట్ల విద్యార్థులు తమ సంతోషం వ్యక్తం చేశారు. తమ తోటి విద్యార్థులకు తాము ఉపాధ్యాయులుగా విద్యాబోధన చేయడం తమకెంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.ఉత్తమ ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులకు ఈ సందర్భంగా బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్, ఉపాధ్యాయులు అంజాద్ సుల్తాన్, పసుపుల ప్రసాద్, విద్యా వాలంటీర్లు పరశురాం, నిఖిత, సంధ్య, సుప్రియ, నగ్మా, సంజన, తదితరులు పాల్గొన్నారు.