– అజరామర నాయకుడు పాండురంగారెడ్డి
నవతెలంగాణ – పెద్దవూర
నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి అడగాలే కాని లేదనకుండా ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. సాగర్ నియోజకవర్గంలోని పలు మండలాల పరిధిలో గల వివిధ గ్రామాల్లో నివసించే గాలి నర్సమ్మ తిరుమలగిరి సాగర్ మండలం కొంపల్లి,మేడి కొండమ్మ గుర్రంపోడు మండలం జువ్వి గూడెం,మొతోజు సత్తయ్య గుర్రంపోడు మండల కేంద్రము,మంగనపల్లి నరసింహ అనుముల మండలం మారే పల్లి,కొర్ర సారి త్రిపురారం మండలం లోక్యా తండా,పోలె బుచ్చయ్య నిడమనూరు మండలం వెనిగండ్ల,ఉప్పునూరి లచ్చమ్మ తిరుమలగిరి సాగర్ మండలం అల్వాల,పురం లింగమ్మ గుర్రంపోడు మండలం కోయగూరోనిబావి గూడెం,గుండు వెంకమ్మ అనుముల మండలం మారేపల్లి గ్రామాల్లో మృతి చెందిన కుటుంబాలకు అండగా నేనున్నాను అంటూ ఒక్కొక్క కుటుంబానికి 100 చొప్పున భోజనాలు పంపించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ అణగారిన వర్గాలకు, నిరుపేద కుటుంబాలకు మన ఆత్మబంధు ఎల్లప్పుడు అండగా ఉంటుందని అన్నారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 9581742356 కు సంప్రదించవలసినదిగా కోరారు. నిరుపేదలని ఆదరిద్దాం అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.