సెల్ఫీ విత్ సీఎం కార్యక్రమంల చేపట్టిన ఉద్యోగులు..

Employees who took selfie with CM programs..నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
సమగ్ర శిక్ష ఉద్యోగులకు సీఎం ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ బుధవారం సమగ్ర శిక్ష ఉద్యోగులు వినూత్న నిరసన తెలిపారు. వందలాదిగా తరలి వచ్చిన ఉద్యోగులు ఎన్టీఆర్ చౌక్ లో  సెల్ఫీ విత్ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం ఫ్లెక్సీ వద్ద సెల్ఫీ దిగారు.. సీఎంకు ఎక్స్ ద్వారా సెల్ఫీ చిత్రాలను పంపించారు. ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను విరమించి, ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేలా స్పష్టమైన హామీ  ఇవ్వాలని సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్, జిల్లా అధ్యక్షురాలు ప్రియాంక డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం నేతలు ధరమ్ సింగ్ పార్థసారథి ప్రశాంత్ రెడ్డి కేశవ్ దేవదర్శన్ వెంకటి నవీన మంగేష్  పాల్గొన్నారు.
Spread the love