ఆన్లైన్ బెట్టింగ్లపై పోలీస్ శాఖ సీరియస్ ..

Police Department is serious about online betting..– ఈజీ మనీ కోసం పెడదారులు పడొద్దు 
– కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలి 
– తల్లిదండ్రులు పిల్లల కదలికలను గమనించాలి 
– నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ఆన్లైన్ బెట్టింగ్లపై పోలీస్ శాఖ సీరియస్ గా ఉందని, యువత ఈజీ మనీ కోసం పెడదరులు పడద్దని కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ఈ మేరకు శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్ అనేది మన రాష్ట్రంలో పూర్తిగా నిషేదం అని తెలియజేశారు. ఇన్ఫ్లూయెన్సర్లు చెప్పారని, సోషల్ మీడియాలో వచ్చిన లింక్లను క్లిక్ చేసి బెట్టింగ్ ఆడకండి, బెట్టింగ్ ఊబిలోకి వెళ్లి బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని కోరుతున్నామన్నారు. ఈజీ మనీ కోసం పెడదా రులు పట్టోద్దు. కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.ఆన్లైన్ బెట్టింగ్లు పోలీస్ శాఖ కూడా సీరియస్ తీసుకుంది. మీ అందరికి తెలుసు దీని పై ఇప్పటికే సిట్’ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బెట్టింగ్ భూతానికి బలై యువకులు బలవన్మరణాలకు పాల్పడుతుండటం బాధాకరం. మన కమిషనరేట్ పరిధిలోనూ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ కేసుల విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. చాలా మంది బెట్టింగ్ బాధితులు తమ పరువు ఎక్కడ పోతుందనే భయం వారిలో ఉంటోంది, ఇది మంచి పద్దతి కాదు. అలాంటి వారు ధైర్యంగా ముందుకు రావాలి. వారికి పోలీస్ శాఖ అండగా ఉంటుంది. మీరు ఇలా చేయడం వల్ల పరోక్షంగా ఎంతో మందిని కాపాడిన వారు అవుతారు. బెట్టింగ్ కూపంలోకి వెళ్లి అప్పుల పాలై యువత తీవ్ర మనోవేధనకు గురవుతోంది. తీసుకున్న అప్పులుకట్టలేక చనిపోవాలని అనుకుంటున్నారు. చనికోవడమనేది సమస్యకు పరిష్కారం కాదు. జీవితం లో అనేక ఒడిదొడుకులు వస్తుంటాయి. ఒక్కసారి కిందపడిపోతే జీవితం ముగిసినట్టు కాదు. బంగారు భవిష్యత్ ఎంతో ముందుంది. తల్లిదండ్రులను పోలీస్ శాఖ ద్వారా కోరుతున్నదేంటంటే మీ పిల్లల కదలికలను గమనించండి. సమస్యగా ఉంటే కారణం ఏంటో ఆరా తీయండి. బెట్టింగ్కు బానిసలయితే వారికి ధైర్యం కల్పించి దాని నుంచి ఎలా బయటపడొచ్చో సవివరంగా చెప్పండి. మీరు భరోసా కల్పిస్తే ఎలాంటి ఆలోచనలు అనేవి వారికిరావు.ఆన్లైన్ బెట్టింగ్ కు సంబంధించిన ఎలాంటి సమాచారానైన మీరు 1930 కి గానీ, డయంల్ 100 కాల్ చేసి కాని ఇవ్వొచ్చు. పోలీస్ శాఖ ఎల్లప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది.
Spread the love