మండలంలోని ఉప్పరగూడెం, అవుతాపురం గ్రామాల్లో జన వికాస ఆధ్వర్యంలో శనివారం చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు వేముల వెంకన్న, సులోచన దేవి మాట్లాడుతూ.. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి జన వికాస ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గ్రామాల్లో చలివేంద్రాల ఏర్పాటు, గొప్ప విషయమని, ప్రజలు చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చలివేంద్రాల ఏర్పాటుకు యువత ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మద్దెల రమ, జె. శైలజ, శోభారాణి, మేనకా, కాంగ్రెస్ నాయకులు దుంపల కుమారస్వామి, వేముల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.