పట్టణంలోని గుడికోట,శివాలయంతో పాటుగా మండలంలోని కొత్తపేట, అల్లీపూర్, ఇటిక్యాల,మైతాపూర్ గ్రామాల్లో మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులు శివాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. మండలంలోని పలు శివాలయాలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.