
– మద్దికుంట ఆలయాన్ని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
– అంగరంగ వైభవంగా రథోత్సవం
– ఏఎస్పీ చతన్య రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు
నవతెలంగాణ – రామారెడ్డి
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని మద్దికుంటతో పాటు అన్నారం, పోసానిపేట్, ఉప్పల్వాయి తదితర గ్రామాల్లో శివాలయాల్లో బుధవారం భక్తుల ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. మద్దికుంటలో వెలసిన శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ప్రభుత్వ సలహాదారు మామ షబ్బీర్ అలీ, ఏ ఎస్ పి చైతన్య రెడ్డి, పోసానిపేట ఆలయాన్ని ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్ రావు దర్శించుకున్నారు. వారికి ఆలయ పూజలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు పట్టు వస్త్రాలను సమర్పించారు. మద్దికుంట తో పాటు పోసానిపేట్, అన్నారం, ఉప్పల్ వాయి దేవాలయాల్లో సందర్శకులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మద్దికుంట ఆలయంలో స్వామివారిని కనుల పండుగ రథోత్సవం నిర్వహించారు. ఆర్టీసీ యాజమాన్యం కామారెడ్డి నుండి మద్దికుంట ఆలయం వరకు ప్రత్యేక బస్సులను నడిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏఎస్పీ చైతన్య రెడ్డి, సిఐ రమణ, ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో బందోబస్త ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి, ఆలయ ప్రధాన కార్యదర్శి నరేందర్, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి మోహన్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు ప్రభాకర్ స్వామి, గణేష్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.